తెలంగాణ సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు

తెలంగాణ సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు
- పాడే మోసిన కేటీఆర్
- మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర
వేములవాడ, ఆంధ్రప్రభ : తెలంగాణ సత్తెమ్మ కు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ సత్తెమ్మ మృతి చెందడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం లోని రగుడు గ్రామంలో నిర్వహించిన ఆమె అంతిమయాత్రలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా పాడే మోసారు. తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారన్నారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పోరాటంలో పాల్గొంటూ జై తెలంగాణ నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. సత్యమ్మ మృతి తీరని లోటు అని, ఆమె కుటుంబానికి చేదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ భారత రాష్ట్ర సమితి ఇంచార్జ్ షర్మిల లక్ష్మీ నరసింహారావు తో పాటు గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
