మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
మోపిదేవి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు.
అనంతరం మంత్రి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంత్రి కొల్లు రవీంద్రను ఆలయ మర్యాదలతో సత్కరించి, స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.
