పట్టణంలో ఫుట్ పాత్ ఆక్రమణ మొరం పక్కదారి..

  • మున్సిపల్ ట్రాక్టర్ల ద్వారానే రవాణా
  • కొరవడిన అధికారుల పర్యవేక్షణ

పరకాల, (ఆంధ్రప్రభ ): పరకాల పట్టణంలోని ప్రధాన రోడ్డులో వ్యాపారస్తులు షాపుల ఎదుట రోడ్డును ఆక్రమణ చేస్తూ పోసుకున్నా మొరం, మట్టి రోడ్డు వెడల్పులో భాగంగా పరకాల మున్సిపాలిటీ అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని పాత మున్సిపాలిటీ కార్యాలయం నుండి శ్రీనివాస కాలనీ, మమతా నగర్ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా షాపుల ఎదుట ఉన్న షెడ్లతోపాటు రోడ్డును ఆక్రమించి మొరం పోసుకున్న షాపుల ఎదుట నుండి మున్సిపల్ అధికారులు తొలగింపు చర్యలను గత రెండు మూడు రోజుల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఆదివారం రోజు కూడా తొలగింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో రోడ్డును ఆక్రమిస్తూ పోసుకున్న మొరం, మట్టి ని మున్సిపల్ జెసిబి, ట్రాక్టర్ల ద్వారా తొలగిస్తూ ఆ మొరం, మట్టిని అధికారుల పర్యవేక్షణలో డంపు చేయవలసి ఉండగా దానికి విరుద్ధంగా పట్టణంలో మొరం అవసరం ఉన్నవారికి ఈ తొలగించిన మొరంను పంపించడం జరుగుతుంది. పట్టణంలోని బస్ డిపో పరిధిలో ఉన్న ఓ కట్టే మిల్లుకు తొలగించిన మొరం ను అక్రమ రవాణా చేయడం జరిగింది. తొలగించిన మొరం మట్టిని మున్సిపల్ ఆధీనంలో ఉంచాలి, దానికి విరుద్ధంగా మొరం, మట్టిని పక్కదారి పట్టించడం పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. పక్కదారి పట్టిన మొరం, మట్టి పై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.