శివనగర్లో ముమ్మరంగా ఓటర్ల నమోదు పరిశీలన..
స్వచ్ఛమైన ఓటర్ జాబితాయే లక్ష్యం.
ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత.. ప్రత్యేక సవరణపై అవగాహన.
జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.
కరీమాబాద్, ఆంధ్రప్రభ : స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం శివనగర్ 34వ డివిజన్‌లోని 170వ బూత్ పరిధిలో బూత్ అధ్యక్షురాలు మార్త ఉషారాణి ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ గ స్వయంగా ఇంటింటికీ తిరిగి ఓటర్ల నమోదు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి, ఎన్యుమరేషన్ ఫారాలు అందాయా లేదా, వాటిని సరైన వివరాలతో నింపారా లేదా అని ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఫారాల నింపకంపై స్థానికులకు అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఎన్యుమరేషన్ ఫారాలను ఖచ్చితంగా పూర్తి చేసి, వెంటనే సంబంధిత బూత్ స్థాయి అధికారులకు (BLO) అందజేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
అనంతరం గంట రవికుమార్ మాట్లాడుతూ… ఎలాంటి తప్పులు లేని, అత్యంత పారదర్శకమైన స్వచ్ఛమైన ఓటర్ జాబితాను తయారు చేయడం మన అందరి బాధ్యత అని అన్నారు. ప్రతి ఓటరు ఈ సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకొని, తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ, జిల్లా నాయకులు బైరి శ్యాంసుందర్, మండల నాయకులు సుంచు కేశవ్, బి.ఎల్.ఎ -2 గంట సందీప్, డివిజన్ కన్వీనర్ పోశాల సతీష్, డివిజన్ నాయకులు కందుకూరి విజయ్ కుమార్, బొజ్జ రంజిత్, ప్రదీప్, చామకూరి శిరీష, శ్రవణ్ తౌటం పాల్గొన్నారు.
