TDP | వైసీపీ నిరసన..

TDP | వైసీపీ నిరసన..

TDP, బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : హిందూపురంలో తెలుగుదేశం గూండాలు చెలరేగిపోయి వైయస్ఆర్ (ysr) కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో విధ్వంసం సృష్టించారు. హిందూ ధర్మ పరిరక్షకులు అని చెప్పుకునే ఈ పార్టీల కార్యకర్తలు కార్యాలయంలోని వినాయక విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్న ఈ రౌడీలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం సృష్టిస్తున్నారని వైయస్ఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు.

సోమవారం వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఆదేశాల మేరకు హిందూపూర్ లో వైసీపీ పార్టీ కార్యాలయం పై కూటమి నాయకులు చేసిన పాశవిక దాడికి నిరసన తెలియచేశారు. బాపట్ల నియోజకవర్గ వైయస్సార్సీపి కార్యాలయం నుండి పెదనందిపాడు ఆర్ఓబి వద్దనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలతో కూటమి ప్రభుత్వం అరాచక పాలన పై వైయస్సార్ సిపి నాయకులు అసహనాన్ని వ్యక్తం చేశారు.

బాపట్ల వైఎస్ఆర్సిపి నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో రేపల్లె వైయస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్, వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు, పట్టణ మండల కన్వీనర్లు, సర్పంచులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి నాయకులు అనుబంధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు, పార్టీలో వివిధ హోదా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.