తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో “ఏ ఇజమూ లేదు, టూరిజమే ముఖ్యం” అనే వ్యాఖ్యలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఈ మాటలు కోపాన్ని కలిగించేవని, కానీ నిజంగా ఖర్చు లేని ఇజం ఏదైనా ఉంటే అది టూరిజమేనని సాంబశివరావు అన్నారు.
దీనిపై చంద్రబాబు నేడు జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో స్పందిస్తూ.. తాను చెప్పిన మాటలను 30ఏళ్ల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో గుర్తు చెయ్యడం సంతోషం అన్నారు.. గతంలో ఏ ఇజం లేదు టూరిజం ఒక్కటే అని తాను మాట్లాడితే తీవ్ర విమర్శలు చేశారన్నారు.. ఏ ఇజం లేదు అని నేను నాడు అంటే కమ్యునిస్టులు నాపై విరుచుకుపడ్డారు.. నాపై విమర్శలు చేశారు.. ఇప్పుడు తెలంగాణలో శాసనసభ్యుడు మాట్లాడతూ.. ఖర్చు లేని ఇజం టూరిజమే అంటూ నేడు స్టేట్ మెంట్ ఇచ్చారని గుర్తుచేశారు.. తాను చెప్పిన మాటలను, తన ఆలోచనలను అర్ధం చేసుకోవడానికి 30ఏళ్లు పట్టింది అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు.. టూరిజంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.