Rajya Sabha Nominations | కూటమి నేతల సమక్షంలో…

Rajya Sabha Nominations | కూటమి నేతల సమక్షంలో…

Rajya Sabha Nominations | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీశ్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణికి రెండు సెట్ల చొప్పున నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు.

నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు కూడా పాల్గొన్నారు. కూటమి ఐక్యతకు ప్రతీకగా ఈ కార్యక్రమం సాగింది. నామినేషన్లు దాఖలు చేయడానికి ముందు టీడీపీ అభ్యర్థులు వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుని నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. వంగవీటి రాధాకృష్ణ సహా పలువురు టీడీపీ సీనియర్ నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం రాజకీయ సందడితో కళకళలాడింది.

Leave a Reply