Tailors | ఘనంగా టైలర్స్ డే దినోత్సవం

Tailors | ఘనంగా టైలర్స్ డే దినోత్సవం
Tailors | పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు పట్టణంలో టైలర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం టైలర్స్ డే వేడుకలు ఘనంగా జరిపారు. మొదట కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హోవే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ రోజురోజుకు పెరిగి పోతున్న రేడిమేడ్ రంగం ప్రభావంతో దర్జీ వృత్తి పై ఆధారపడి జీవించే అనేక కుటుంబాల పరిస్థితి ఆగమ్యగో చరంగా మారిందన్నారు.
దర్జీ వృత్తి స్థితిగతులపై రాజకీయ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళ వలసిన ఆవశ్యకతను వివరించారు. దీని పై ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి మరో మారు విన్నవించడం జరుగుతుందన్నారు. దర్జీలకు ప్రభుత్వం అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం స్థానికంగా టైలర్ దినోత్సవ పురస్కరించని బైక్ ర్యాలీ నిర్వహించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పళ్ళు రొట్టెలను పంపిణీ చేశారు.
టైలర్ సంఘ అధ్యక్షుడు కానోళ్ల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో టైలర్స్ సంఘనాయకులు, అర్జెంపూడి మాణిక్యాలరావు, దునుకు దుర్గాప్రసాద్,ఎండి బాజాని, తాతాకృష్ణారావు, సుప్రీం టైలర్ వీరాంజనేయులు పాల్గొన్నారు.
