సీనియర్ జర్నలిస్ట్ దుగ్యాల రవికుమార్ మృతి

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ పరిధిలోని తుర్కపల్లి మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దుగ్యాల రవికుమార్ మృతి చెందారు. తుర్కపల్లి మండల ఆంధ్రప్రభ విలేఖరిగా ఆయన సుదీర్ఘకాలం సేవలు అందించారు. ఆర్ఎంపి వైద్యునిగా కూడా తుర్కపల్లి ప్రాంతంలో ప్రజలకు రవికుమార్ సుపరిచితులు. రవికుమార్ మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానికులు బుధవారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.