Agriculture | అమెరికాతో వ్యవసాయ ఒప్పందాలు
Agriculture | అమెరికాతో వ్యవసాయ ఒప్పందాలు
భారత రైతాంగానికి తీవ్ర నష్టం కలిగిస్తాయి..
రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి…
ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..
Agriculture | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : అమెరికాతో భారత్ చేసుకుంటున్నా వ్యవసాయ ఒప్పందాలు వల్ల భారత రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నంద్యాల రైతు సంఘం కార్యకర్తలతో సమావేశంను జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడుతో కలిసి ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంపుతో చేసుకుంటున్న ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల మన దేశంలోనీ 11 కోట్ల మంది రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందన్నారు.
ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు రద్దుచేసి, ఎగుమతులపై సుంకం విధించేలాగా ఒక అసమానత ఒప్పందం భారత్, అమెరికా చేసుకోవటాన్ని ఏపీ రైతు సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. గత ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట పై నుండి వ్యవసాయ రంగాన్ని, రైతులను కాపాడుతానని, వారికి అండగా నిలుస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.
ఆస్ట్రేలియా, బ్రిటన్ దేశాలతో ఎలాంటి సుంకాలు లేకుండా పత్తి దిగుమతి చేసుకోవటం వల్ల భారతదేశంలోని రైతులందరికీ తీవ్రమైన నష్టం వాటిల్లిందన్నారు.ఈ ఒప్పుందాల వల్ల పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పండ్లు దిగుమతి అవుతాయన్నారు.దేశ ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా బ్బతింటారన్నారన్నారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జోక్యం చేసుకోవాలని కోరుతూ నేటి నుండి మార్చి 29 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రైతు సంఘం ద్వారా అన్ని గ్రామాల్లో కరప్రతాలు ,సభల ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని రైతులందరూ ఒప్పందాలను వ్యతిరేకిస్తూ గ్రామసభల్లో తీర్మానం చేసి వాటిని ఆయా గ్రామాల్లోని పోస్ట్ ఆఫీస్ ల ద్వారా రాష్ట్రపతి గారికి రిజిస్టర్ పోస్టు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలోపలువురు పాల్గొన్నారు.
