ప్రజావేదికలో అల్లూరి 102వ వర్ధంతి..
ప్రజావేదికలో అల్లూరి 102వ వర్ధంతి..
చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాము, కూటమి నేతలు..
గుడివాడ, ఆంధ్రప్రభ : స్వతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాలను గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘జోహార్ అల్లూరి సీతారామరాజు’ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, “తెలుగు జాతి గర్వించదగ్గ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించి, గిరిజనుల హక్కుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుడనీ కొనియాడారు. ‘మన్యం దొర’గా పేరొందిన అల్లూరి త్యాగం, తెగువ, దేశభక్తి యావత్ భారత జాతికి స్ఫూర్తిదాయకమన్నాడు. కేవలం 27 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర్య సంగ్రామంలో తన ముద్ర వేసిన అమరవీరుడు” అని కొనియాడారు.

అల్లూరి సిద్ధాంతాలను, ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన స్ఫూర్తితో దేశ సేవకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ టిడిపి అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టిడిపి నాయకులు గుడివాడ జోన్స్, యార్లగడ్డ సుధారాణి, కంచర్ల సుధాకర్, వడ్డాది నాగరాజు, దేవేంద్రుడు, బొంబాయి శ్రీను, సయ్యద్ జబీన్,షణ్ముఖ రెడ్డి, దారపురెడ్డి మనీశ్వరరావు, కురాడ మధు, హరిబాబు, ఇమాన్యులు,తులసి రాణి, గొర్ల శ్రీలక్ష్మి, సునీత, సతీష్, రామకృష్ణ, మహేష్, డొక్కు మాల శ్రీకాంత్, మాణిక్యాలరావు,కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
