నాజర్ వలి సేవలు చిరస్మరణీయం

నాజర్ వలి సేవలు చిరస్మరణీయం
సీపీఐ మాజీ ఎమ్మెల్యే 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
విజయవాడలో విగ్రహానికి పూలమాల వేసిన దేవినేని అవినాష్
పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేతలు
విజయవాడ, ఆంధ్రప్రభ : షేక్ నజర్ వలి 6వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రాణిగారి తోట 17, 18 డివిజన్ కూడలి వద్ద ఆయన కుమారుడు బాబూలాల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ షేక్ నాజర్ వలి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, నాజర్ వలి ప్రజాసేవలో చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో 17వ డివిజన్ మాజీ కార్పొరేటర్ తగిరాల రామిరెడ్డి, 17వ డివిజన్ అధ్యక్షులు ముదుకోటి కాసిం, 18వ డివిజన్ అధ్యక్షులు భిక్షాల్ రెడ్డి, కొమిరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
