Suryapet | కష్టసుఖాల్లో అండగా ఉంటా
గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నా..
సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కాసరబాధ సర్పంచ్ అభ్యర్థి కోతి గోపాల్ రెడ్డి
Suryapet | సూర్యాపేట రూరల్, ఆంధ్రప్రభ : రాజకీయాలకతీతంగా గ్రామ ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటానని సూర్యాపేట (Suryapet) కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కాసరబాద్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోతి గోపాల్ రెడ్డి (Gopal Reddy) అన్నారు. శనివారం గ్రామంలో రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేసి ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించడంలో కాసర బాధ ముందుందన్నారు.
ఇప్పటికే గ్రామంలో 129 ఇందిరమ్మ ఇండ్లు (Indiramma houses) మంజూరు చేయగా, నిర్మాణంలో ఉన్నాయని, మిగతా అవసరమైన వారికి త్వరలోనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో నిర్మాణాల మధ్యలో ఆగిపోయిన తిరుపతమ్మ తల్లి దేవాలయ నిర్మాణంతో పాటు ఎస్సీ కాలనీలో ఉన్న రామాలయంలో విగ్రహ ప్రతిష్ట ఎండాకాలంలో పూర్తి చేస్తానన్నారు. గ్రామానికి వచ్చే ప్రధాన దారిలో వాగుపై బ్రిడ్జిని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి మంజూరు చేయిస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రహీం, ఆయుబ్ ఖాన్, మన్నెం మల్లేష్ యాదవ్, అబ్బాస్, తదితరులు పాల్గొన్నారు.

