Fake Break Inspector : అతడే ఇతడు

Fake Break Inspector : అతడే ఇతడు

ఓ ఏఎస్​ఐ ముద్దు బిడ్డ

చీటింగ్​ లో దిట్ట

చౌక బంగారం పేరిట రూ.40లక్షలతో పరారు

ఇప్పుడు బ్రేక్​ ఇన్స్​ పెక్టర్​ అవతారం

కంటైనర్​ ను అడ్డుకోవటంతోనే ఘోర ప్రమాదం

ఐదుగురు విద్యార్థుల మృతి కారణం

కేసు దర్యాప్తులో.. ఉన్నతాధికారులు సీరియస్​

నకిలీ ముఠా కోసం గాలింపులో బిజీబిజీ

Fake Break Inspector ఆంధ్రప్రభ , పల్నాడు బ్యూరో : ఆరుగురు స్నేహితులే .. వీరందరూ బీటెక్​ విద్యార్థులే. అందరూ చదువరులే. పోకిరీ అలవాట్లకు దూరంగా..  ఆధ్మాత్మిక చింతనతో అయ్యప భక్తులుగా.. అకుంటిత దీక్షతో నవ యవ్వనంలోనే కన్పె స్వాములయ్యారు.    అయప్ప భజనకు బయలుదేరారు. దారి మధ్యలో కంటైనర్ (Container) ​ రూపంలో మృత్యువు ఐదుగురిని (Five Alive Dead)  మింగేసింది. ఆరో ప్రాణాన్ని వదిలేసింది. ఇదీ విషాద గాధ.

Fake Break Inspector

కానీ.. ఈ దుర్ఘటనకు అసలు సిసలు మృత్యువు పోలీసులకు చిక్కాడు. అసలీ ప్రమాదమే ఒ మిస్టరీగా (Mystory)  భావించిన పోలీసులు.. ఈ దురాఘతానికి కారకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నిస్తే.. నేర చిట్టా మొత్తం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఈ నిందితుడు ఎవరో కాదు.. ఓ పోలీసు ఉద్యోగి (Police Son)  ముద్దుల కొడుకు. చట్టానికి ఏ రీతిలో తూట్లు పొడవగలడో.. గ్రహించిన నేరసంథ్యగ్రహి.ఇక ఇతడి చరిత్ర తెలుసుకుని పోలీసులు (Fake Break Inspector )  సైతం ముక్కున వేలేసుకున్నారు. పోలీసు ముసుగులో దారిదోపిడీ ముఠా గుట్టును రట్టు చేస్తున్నారు.   

 Fake Break Inspector : ఏమి జరిగిందంటే…

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్  ఇంజనీరింగ్​ కాలేజీలో  బీటెక్  చదువుతున్న ఐదుగురు విద్యార్థులు అయ్యప్ప   మాల ధరించారు. చలపతి కాలేజీలో  చదువుతున్న  తమ స్నేహితుడు తో కలిసి ప్రకాశం జిల్లా, ముండ్లమూరి మండలం, విఠలాపురంలో మేడగం రామిరెడ్డి ఇంట్లో    అయ్యప్ప   భజనకు కారులో బయలుదేరారు.

నాదెండ్ల మండలం గణపవరం పరిధిలోనే నూతన బైపాస్  వద్ద గుంటూరు వైపు నుంచి  ఒంగోలు వైపు  కొత్త ట్రాక్టర్లతో వెళ్తున్న కంటైనర్ ను ఈ కారు  వెనుక నుంచి  వేగంగా  ఢీ కొట్టింది.   కంటైనర్ లోకి దూసుకుపోయింది.  కారు నుజ్జు నుజ్జు  అయ్యింది.

Fake Break Inspector

 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురానికి   చెందిన మేడగం రామిరెడ్డి (Rani Reddy)  (21), వినుకొండ మండలం శివాపురం గ్రామానికి చెందిన మేరుగా వెంకట నాగ శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy)  (21), నూజెండ్ల మండలం మొలకలురికి చెందిన వడవర్తి యశ్వంత్ సాయి (Yaswanth Sai) (19), పిడుగురాళ్ల పట్టణం చింతకాయల డొంకకు చెందిన శివరాత్రి (Mahesh Babu) మహేష్ బాబు (19), నూజిండ్ల మండలం ములకలూరు చెందిన వంగ వోలు వాసు (19) (Vasu) , ప్రమాద స్థలిలో అక్కడిక్కడే ప్రాణాలు వీడారు.

 మృతదేహాలను కూడా గుర్తుపట్టలేని విధంగా నుజ్జు అయ్యారు. వినుకొండ మండలం దొండపాడుకు చెందిన కార్తీక్ (Kartik Injured)  తీవ్రంగా గాయపడగా..  గుంటూరు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Fake Break Inspector : అతడే  ఇతడు

పల్నాడు జిల్లా, చిలకలూరిపేట వద్ద ఈనెల 4న  కంటైనర్ ఢీకొని 5 విద్యార్థులు మృతి చెందిన ఘటన వెనుక అసలు కథ వెలుగులోకి వచ్చింది.   ఈ ఘోర  రోడ్డు ప్రమాదం  చిక్కుముడి వీడనుంది. రోడ్డుపై కంటైనర్ ని నిలపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని  పోలీసులు తేల్చారు. ఇందుకు  బ్రేక్ ఇన్స్​ పెక్టర్ ( Fake Break Inspector) ​ తెరమీద ప్రత్యక్షమయ్యాడు.

 Fake Break Inspector

ఏ ఎస్సై కుమారుడు, అతని గ్యాంగ్ (Gang)   బ్రేక్​  ఇన్స్​ పెక్టర్​ అవతారంలో  హైవేలపై  వాహనాలు (Stoped Vehicles)  ఆపుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది.  ఆరోజున . హైవేపై  (On highway) ఒక్కసారిగా కంటైనర్ ఆపడం వల్లే ఘోర ప్రమాదం జరిగినట్లు అధికారుల నిర్ధారణ కు వచ్చారు.

Fake Break Inspector

ఈ కంటైనర్​ ను వెంటాడి..  కారులో నుండి దిగి   ఆపాలని  ఏఎస్సై కుమారుడు సైగ చేయటంతోనే.. తాను కంటైనర్​ కు షడన్ ​బ్రేక్​ వేసినట్టు ట్రక్​ డ్రైవరు ఇచ్చిన సమాచారంతో.. ఈ దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఆ బ్రేక్​ ఇన్స్​ పెక్టర్​ ఎవరో కాదు,  నరసరావుపేట డీఎస్పీ ఆఫీస్ లో పనిచేసే ఏ ఎస్ ఐ కుమారుడిగా అధికారులు   నిర్ధారించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

Fake Break Inspector : ఇది వసూళ్ల గ్యాంగ్​

 2023 లో నరసరావుపేటలో తక్కువ ధరకే Gold For Small Ammount)  బంగారం అంటూ 40 లక్షలతో ఏఎస్ఐ కుమారుడు ఉదాయించినట్లు తెలుస్తోంది. ప్రత్యేక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని మరీ  జిల్లాలో పలు దందాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.  ఏ ఎస్ ఐ కుమారుడుడి అదుపులోకి తీసుకొని చిలకలూరిపేట పోలీసులు విచారిస్తున్నారు.

 ఇక సోమవారం చిలకలూరిపేట గ్రామీణ పోలీస్ స్టేషన్ కు గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, పల్నాడు ఎస్పీ బి కృష్ణారావు, ఇంటిలిజెన్సీ వర్గాలు వచ్చి ఈ కేసు పై పూర్తిస్థాయి విచారణ జరిపినట్లు సమాచారం. నిందితుడు ఏఎస్ఐ కుమారుడు కావడంతో ఈ వ్యవహారాన్ని  పోలీసు అధికారులు (Police Officers Serioud)  సీరియస్​ గా  తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ALSO READ : KOTEKAL  DEATH CURVE |  మృత్యువు మలుపే

click here to read more

Leave a Reply