వికారాబాద్ జిల్లా డీఎంహెచ్వో గా సుధాకర్ లాల్
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా (డీఎంహెచ్‌వో) డాక్టర్ కే. సుధాకర్ లాల్‌ను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు శనివారం డాక్టర్ కే. సుధాకర్ లాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన డీఎంహెచ్‌వోకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు.
అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఐఏఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని నివేదించారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా డాక్టర్ కే. సుధాకర్ లాల్ తెలిపారు.
