టీపీసీసీ మీడియా విభాగానికి కొత్త చైర్మన్..

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం రాష్ట్ర చైర్మన్‌గా చామల కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు పార్టీ అధికారిక సమాచార విభాగం ఐఎన్‌సీ సందేశ్ గురువారం వెల్లడించింది.

ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ పేర్కొంది. మీడియా, ప్రచార కార్యక్రమాల సమన్వయం, పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను చామల కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.