Vikarabad | ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం

వికారాబాద్, ఏప్రిల్ 23 (ఆంధ్రప్రభ) : ప‌హ‌ల్గామ్ లో ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల‌కు నిర‌స‌న‌గా వికారాబాద్ జిల్లా కేంద్రంలో అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఉగ్ర‌వాదుల దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కన్వీనర్ హరీష్ రావు మాట్లాడుతూ… భారతదేశంలో ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వం లాగా బ్రతుకుతూ ఉంటే పాకిస్తాన్ కు అమ్ముడుపోయిన కొంతమంది దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నార‌న్నారు.

జమ్ము కాశ్మీర్ లో పర్యటన కోసం వచ్చిన ప్రజలను విచక్షణా రహితంగా కాల్చి చంపడం చాలా బాధాకరమ‌న్నారు. మీరు చేస్తున్న ప్రతి కుట్రను ఎదుర్కోవ‌డానికి ఈరోజు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మీ తాటాకు చప్పుళ్ల‌కు ఎవరూ భయపడరన్నారు. మీరు నిజంగా యుద్ధాన్ని కోరుకుంటే భారత ఆర్మీతో తలబడాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ తేజ, ఉపాధ్యక్షుడు దయాకర్, శివ, సంపత్, మనీ రామకృష్ణ, బాలకృష్ణ, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply