Vikarabad రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది..

Vikarabad రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది..

ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి తీవ్ర విమర్శలు

వికారాబాద్‌ (Vikarabad), ఆంధ్రప్రభ: రాష్ట్రంలో, ముఖ్యంగా జిల్లాల్లో మహిళలకు రక్షణ కరువైందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి తీవ్రంగా విమర్శించారు. మహిళలపై, మైనర్ బాలికలపై అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. వికారాబాద్‌లో ఆదివారం ఐద్వా జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి అనసూయ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మహిళా హక్కులపై విస్తృతంగా చర్చించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న అరుణ జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో బాలికలపై అత్యాచారాలు, బాల్య వివాహాలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయడంలో పాలకులు, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కొన్ని సందర్భాల్లో నిందితులకు రాజకీయ నాయకులు, పోలీసులే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని, ప్రతి ఒక్కరు చదవాలని, తమ హక్కుల కోసం ప్రశ్నించాలన్నారు. పని ప్రదేశాల్లో ఎదురయ్యే ఇబ్బందులపై కూడా మహిళలు సంఘటితంగా పోరాడాలని సూచించారు. అదే విధంగా గ్రామాల్లో అధికారులు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలని, బాల్య వివాహాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హామీలైన ఉచిత గ్యాస్, రేషన్ సరుకులు, డ్వాక్రా రుణాల మాఫీ, మహిళా నిరుద్యోగులకు ఉద్యోగాలు వెంటనే అమలు చేయాలని కోరారు. మహిళా ఉద్యోగులను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాలు అనసూయ, లక్ష్మి, లలిత, బి. వెంకటమ్మ, పి. లక్ష్మీ, శాంతమ్మ, గౌతమి, యశోద, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply