Farmers Promise | రైతుల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

Farmers Promise | రైతుల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

Farmers Promise | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. రాష్ట్రంలో అదనపు తూకం లేకుండా ధాన్యం సేకరణ పూర్తిస్థాయిలో జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పెన్షన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రూ.200గా ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచారని గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని, ముందుగా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రూ.2 వేల పెన్షన్ అందేలా చూడాలని సూచించారు.

అలాగే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని, ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *