Vikarabad |డెంగ్యూ నిర్మూలన అందరి బాధ్యత.. డీఎంహెచ్ఓ వెంకటరమణ

వికారాబాద్, మే 16 (ఆంధ్రప్రభ): జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం వికారాబాద్ డీఎంహెచ్ఓ డా.వెంకట రమణ నేతృత్వంలో స్థానిక ప్రభుత్వాసుపత్రి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ.. డెంగ్యూ నివారణ మన చేతిలోనే ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించి, డెంగ్యూను పూర్తిగా పారద్రోలాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వైద్యారోగ్య సిబ్బందితో పాటు డిప్యూటీ హెచ్ ఓ డా. జీవరాజ్, డెమో అధికారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *