2023Election | మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డు

2023Election | మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ రికార్డు

2023Election | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ నంబర్ కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు, ఆయన స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు.

పోలీసుల సమాచారం ప్రకారం, 2023 ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉపయోగించిన ఫోన్ నంబర్ ట్యాపింగ్‌కు గురైనట్లు దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మంత్రి నివాసానికి వెళ్లి వివరాలు సేకరించారు.

తుమ్మల వినియోగించిన ఫోన్ నంబర్‌కు సంబంధించిన వివరాలను చూపించి, ఘటనపై ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితులుగా గుర్తించిన పలువురు ప్రముఖుల నుంచి ఇప్పటికే సిట్ వాంగ్మూలాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే.

ఈ కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వస్తుండటంతో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.