నీటి మునిగిన వ‌రి పంట‌

నీటి మునిగిన వ‌రి పంట‌

ఎండపల్లి, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండల కేంద్రానికి చెందిన యువ రైతు దాసరి మల్లేశం వరి పంట నష్టంతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేసిన ఆయనకు, గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల ప్రభావంతో ఏకురం పంట నీటమునిగిపోయిందని తెలిపారు. తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని కోరారు. రైతు నష్టాన్ని జిల్లా వ్యవసాయ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి నివేదిక పంపించాలని కోరారు.