ఆశీర్వదించండి… అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా

ఆలేరు, ఆంధ్రప్రభ : ఒక్కసారి ఆశీర్వదించండి… అభివృద్ధినే ధ్యేయంగా చేసుకుని పనిచేస్తాను అని బీఆర్ఎస్ బలపరిచిన 2వ వార్డు సభ్యురాలు చిలుక నిరోష స్వామి అన్నారు. మంగళవారం శారాజీపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి కంతి మహేందర్తో కలిసి ఆమె ఇంటింటా విస్తృత ప్రచారం నిర్వహించారు. నిరోష మాట్లాడుతూ… గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ, అందరికీ చేదోడువాదోడుగా పనిచేయడం తన లక్ష్యమని పేర్కొన్నారు. తనకు ఓటు వేసి గెలిపించాలని, తన గెలుపుకోసం శ్రేయోభిలాషులు, ఓటర్లు సహకరించాలని ఆమె కోరారు.

Leave a Reply