Stock markets | భారీ నష్టాలతో సూచీలు

Stock markets | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయంతో స్టాక్ మార్కెట్లు భారీగా కుంగిపోయాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావం పడింది. దీంతో ఇవాళ‌ ఉదయం భారీ నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ వెయ్యికిపైగా పాయింట్ల నష్టంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది.

డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 24 పైసలు పడిపోయింది. సెన్సెక్స్ ఓపెనింగ్ బెల్ మోగగానే 1,100 పాయింట్లకు పైగా క్షీణతతో ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 300 పాయింట్లకు పైగా పడిపోయింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మిస్సైల్ దాడులు, ప్రతీకార దాడులు వంటి పరిణామాలు మార్కెట్లపై భారీగా ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లు భారీగా క్షీణతతో ట్రేడవుతున్నాయి.

Leave a Reply