Deputy CM | సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ నమస్కారం

Deputy CM | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సిద్ధరామయ్య నిర్వహించిన అల్పాహార విందు సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సిద్ధరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సమావేశంలో డీకే శివకుమార్ ముందుగా సిద్ధరామయ్యకు నమస్కరించగా.. అనంతరం ఇద్దరు నేతలు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాలు కర్ణాటక రాజకీయాల్లో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
