ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సతీమణి
మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం నిర్వహించిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సతీమణి, మాజీ ఎంపీటీసీ వాకిటి లలిత పాల్గొన్నారు.
బొందలకుంట, పంచదేవ్ పహాడ్, ముస్లాయిపల్లి, పసుపుల గ్రామాల్లో నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులతో కలిసి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ **’వాకిటి వారి కానుక’**ను అందజేశారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల నెరవేరడం ఆనందదాయకమని పేర్కొంటూ, ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను అందించేందుకు కృషి చేస్తోందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా, గుడిగన్ల శ్రీనివాస్ గౌడ్, పారేవుల విష్ణువర్థన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు వేణు గౌడ్, వాకిటి భాస్కర్, పాండు తదితరులు పాల్గొన్నారు.
