సారా స్థావరాలపై పోలీసుల దాడులు

సారా స్థావరాలపై పోలీసుల దాడులు
మరిపెడ, ఆంధ్రప్రభ : మండలంలోని కోట్య తండా చెవుల తండా, జాల్ తండా, ఆర్లగడ్డ తండాల్లో కాటన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ పవన్ కుమార్ ఎస్సై గండ్రాతి సతీష్ చిన్నగూడూరు ఎస్సై కుశకుమార్ ఆధ్వర్యంలో తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీల్లో 50 లీటర్ల సార, నాలుగు క్వింటాళ్ల బెల్లం, 50 కేజీల పట్టిక, వెయ్యి లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. గంజా మత్తు పదార్థాలు విక్రయించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా సారాయి తయారు చేస్తున్న వ్యక్తుల పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ తనిఖీల్లో మరిపెడ సీఐ, 3 ఎస్సైలు, 25 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

