ఎన్టీఆర్ సేవలు మరువలేనివి…

పెద్దపల్లి రూరల్, ఆంద్రప్రభ : స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సేవలు మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణం ప్రగతినగర్ లో గురువారం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, ఎన్టీఆర్ అభిమాని సంఘం నాయకులు ఉప్పు రాజు, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ కూర మల్లారెడ్డి, మాజీ జడ్పీటిసి బండారి రాంమూర్తి, కౌన్సిలర్లు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
