బాధిత కుటుంబానికి బాసటగా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్

రాయపర్తి, ఆంధ్రప్రభ : రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమం నిర్వహించారు.
మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నిమ్మల యాకయ్య కుమార్ తల్లి నిమ్మల లింగమ్మ ఇటీవల మృతిచెందగా, గురువారం ఫౌండేషన్ ప్రతినిధులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఫౌండేషన్ తరఫున 50 కేజీల బియ్యం, ఒక ఆయిల్ క్యాన్‌ను సహాయంగా అందజేశారు.
పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సూచనలతో ఈ సహాయ కార్యక్రమాన్ని మండల పార్టీ నాయకులు లేతాకుల రంగారెడ్డి, మాజీ సర్పంచ్ కర్ర సరితా రవీందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు దేశబోయిన ఉపేందర్, మండల నాయకులు పుల్ల ఎల్లగౌడ్, సోమన్న, నేరెళ్ల రాములు, కర్ర ప్రవీణ్ రెడ్డి, దేవేందర్, సురేష్, కలరావు, జనార్దన్, యుగేందర్, రాజు, వరుణ్, ఎల్లయ్య, యూత్ నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులకు అందజేశారు.
