శ్రీశైలం అమ్మవారికి వెండి నాగాభరణం విరాళం
నంద్యాల, ఆంధ్రప్రభ: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి రంగారెడ్డి జిల్లాకు చెందిన భక్తులు మంగళవారం వెండి నాగాభరణాన్ని విరాళంగా సమర్పించారు. నాదర్గుల్కు చెందిన పి. రవీందర్ కుటుంబ సభ్యులు అమ్మవారు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఐదు శిరస్సులతో కూడిన వెండి నాగాభరణంతో పాటు వెండి చెంబును దేవస్థానానికి అందజేశారు. వీటి మొత్తం బరువు 416 గ్రాములు ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ వెండి కానుకలను అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి, ఉపప్రధానార్చకులు బి. వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆలయ ఇన్స్పెక్టర్ కె. మల్లికార్జున, గుమాస్తా సావిత్రికి అందజేశారు. అనంతరం దేవస్థానం తరఫున రసీదు అందించి, వేదాశీర్వచనంతో పాటు శ్రీస్వామి, అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలను దాతలకు అందజేశారు.
