ys jagan | రాష్ట్ర పరిస్థితులు, పరస్పర అంశాలపై చర్చ
ys jagan | రాష్ట్ర పరిస్థితులు, పరస్పర అంశాలపై చర్చ
ys jagan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ టెక్ చియాంగ్‌తో సమావేశమయ్యారు. చెన్నై నుంచి వచ్చిన సింగపూర్ ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలు, పరస్పర ఆసక్తి కలిగిన విషయాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. అయితే సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారనే విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇప్పటికే సింగపూర్ కాన్సుల్ జనరల్ బృందం మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమైన నేపథ్యంలో, ఇప్పుడు ప్రతిపక్ష నేత జగన్‌తోనూ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. దౌత్య ప్రతినిధులు ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలను మర్యాదపూర్వకంగా కలవడం సాధారణ ప్రక్రియ అయినప్పటికీ, ఈ వరుస భేటీలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ సమావేశంలో ఇరువైపుల ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలిసింది.

