ఎట్టకేలకు పూర్తయిన చెన్నూరు కో- ఆప్షన్ సభ్యుల ఎంపిక
చెన్నూర్ ఆంధ్రప్రభ : ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్నా చెన్నూరు మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక మంగళవారం మున్సిపల్ చెర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన మున్సిపాటి సాధారణ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు పూర్తయింది. చెన్నూరు మున్సిపాల్టీ పాలకవర్గం ఎన్నికల అనంతరం మున్సిపాలిటీ గాను నాలుగు కో ఆప్షన్ సభ్యులు కేటాయించి ఉండగా రెండు నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా 17 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
దరఖాస్తుల స్వీకరణ అనంతరం మంత్రి ఆదేశాల మేరకు కొంతమంది మాజీ కౌన్సిలర్ల తో పాటు పార్టీ లో చేరిన కొత్త నాయకులకు చోటు కల్పిస్తూ రహస్యలేఖ ద్వారా మున్సిపల్ కార్యాలయానికి సందేశం వచ్చినప్పటికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకుల వ్యతిరేక కారణంగా రెండు నెలలుగా సభ్యుల నియామకాం వాయిదాపడుతూ వచ్చింది. ఇవ్వాళ మంత్రి వివేక్ ఆదేశానుసారం మున్సిపల్ సాధారణ సమావేశంలో తనుగుల సరోజన, సాధనబోయిన కృష్ణ (మాజీ సర్పంచ్ ), ఖలీల్ ఖాజాబేగం, సయ్యద్ సాహీర్ లను కో ఆప్షన్ సభ్యులుగా నియమించారు.
