రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ
మోత్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు సూరోజు తిరుపతయ్య శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు మధ్యాహ్నం రిటైర్డ్ ఉద్యోగులు సూరోజు భాస్కరా చారి,యాదమ్మ ల ఆర్ధిక సహకారంతో నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి,సి ఐ వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రజాభారతి, టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యాయుల సమన్వయంతో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నరసింహ, రెడ్ క్రాస్ డైరెక్ట్ లు పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఎన్ చారి,చేతరాశి అంజయ్య, రెడ్ క్రాస్ యూత్ అధ్యక్షులు బీసు మచ్చగిరి, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అక్కినపల్లి వెంకటాచారి, దర్శనం వెంకన్న, యామగాని బుగ్గయ్య , డ్రైవర్లు కండక్టర్లు వీరితో పాటు సుమారు 800 మంది ప్రయాణికులు పాల్గొన్నారు.
