Sportsmen | వామ్మో ఇదేం దుమ్ము…
Sportsmen | వామ్మో ఇదేం దుమ్ము…
- దుమ్ములోనే సీఎం కప్ పోటీలకు..
- ఇదేం దుస్థితి అంటున్న క్రీడాకారులు క్రీడాభిమానులు
Sportsmen | చర్ల, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని లెనిన్ కాలనీ సమీపంలో గల గ్రౌండ్ జరుగుతున్న సీఎం కప్ రెండవ ఎడిషన్ క్రీడా పోటీలకు వెళ్లాలంటే క్రీడాకారులు, క్రీడాభిమానులు జంకుతున్నారు. ఇందుకు కారణం మైదానానికి వెళ్లే మార్గంలో వెదజల్లే దుమ్ము, ధూళి అనే చెప్పాలి!పూజారిగూడెం నుండి లెనిన్ కాలనీ గ్రౌండ్ కి వెళ్లే మార్గంలో ఇదివరకే కిలో మీటర్ మేర చిప్స్ మెట్టెలతో సిమెంట్ మిక్సింగ్ పోసి వదిలేశారు.
ప్రస్తుతం ఈ రహదారి అధ్వాన్నంగా తయారైంది.దుమ్ము ధూళి విపరీతంగా వెదజల్లుతోంది.డివిజన్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్న తరుణంలో కనీసం దుమ్ము ధూళి వెదజల్లే రోడ్డుపై వాటర్ క్యూరింగ్ చెయ్యకపోవడం పట్ల క్రీడాకారులు క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ,ఏ.ఎస్.పి అధికారులు వచ్చినప్పటికీ కనీసం క్రీడామైదానికి వచ్చే రోడ్డుని పట్టించుకోకపోవడంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
