ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ పనుల పరిశీలన
వేంసూరు, ఆంధ్రప్రభ: ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్కె యాస్మిన్ భాష కాంట్రాక్టర్లకు సూచించారు. సుమారు రూ.200 కోట్ల రూపాయల వ్యయంతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టిన ఫ్యాక్టరీ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పూర్తి అయిన పనులు, పూర్తి కావలసిన పనుల పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తే, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కలుగుతుందన్నారు. పనుల పురోగతిని ఎప్పటి కప్పుడు పరిశీలిస్తూ, నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ ప్రాజెక్ట్ అండ్ ప్లాంట్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఫ్యాక్టరీ ఇంచార్జ్ పవన్ కుమార్, ఆయిల్ ఫెడ్ అధికారి సుధాకరరెడ్డి, హార్టికల్చర్ జాయింట్ డైరెక్టర్ సరోజినిదేవి, డిహెచ్ఎస్ఓ మధుసూదనరావు, కల్లూరుగూడెం గ్రామానికి చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు.
