భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా గోపు రామకృష్ణ నియామకం

జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా గోపు రామకృష్ణ (ఆర్కే నాయుడు) నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గోపు రామకృష్ణ, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. బీఆర్‌ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు, పోరాటాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గోపు రామకృష్ణ మాట్లాడుతూ, మండలంలో కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తగా అనేక నిర్బంధాలను ఎదుర్కొని పనిచేశానన్నారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన కార్యకర్తలను గుర్తించి డీసీసీ కార్యదర్శి పదవి ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పేదల సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరించేందుకు కృషి చేస్తానన్నారు. తనను జిల్లా కార్యదర్శిగా నియమించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నకు, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు గోపు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply