చౌటుప్పల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలి

చౌటుప్పల్ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలి

  • గంగాదేవి సైదులు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలం వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఉపాధి వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గంగాదేవి సైదులు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. చౌటుప్పల్ రాష్ట్రంలో కీలక ప్రాంతంగా ఎదుగుతున్నా, ఆశించిన స్థాయిలో నిధులు, అభివృద్ధి ప్రణాళికలు అందడం లేదన్నారు.​గ్రామీణ రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు. రైతులకు సాగునీరు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు యువత కోసం కొత్త పరిశ్రమలు స్థాపించాలని డిమాండ్ చేశారు. అలాగే చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి సమగ్ర ప్రణాళిక రూపొందించని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని గంగాదేవి సైదులు హెచ్చరించారు.