జనావాసాల మధ్య ఉన్న రైస్ మిల్లులను తొలగించాలి

జనావాసాల మధ్య ఉన్న రైస్ మిల్లులను తొలగించాలి

  • కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు
  • అనారోగ్య పాలవుతున్న మున్సిపల్ ప్రజలు
  • మున్సిపల్ చైర్మన్ కి వినతిపత్రం

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో జనావాసాల మధ్య ఉన్న రైస్ మిల్లులతో ప్రజలు అనారోగ్యం పాలవుతాన్నారని తక్షణమే వాటిని పట్టణానికి దూరంగా తరలించాలని డిఫెన్స్ వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షులు గుమ్మిడేల్లి పరశురాములు మంగళవారం మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య కి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

ప్రధానంగా రైస్ మిల్లులు నుంచి వచ్చే పొగ , దుర్వాసన, దుమ్ము ,కాలుష్యం తో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, మిల్లులను పట్టణానికి కు దూరంగా తరలించి ప్రజల ఆరోగ్యాలను సంరక్షించాలని కోరారు. మున్సిపల్ పరిధిలో పరమేశ్వర , ధనలక్ష్మి, రామకృష్ణ, శ్రీనివాస, గణేష్ రైస్ మిల్లుల నుంచి విపరీతమైన పొగ, కలుషితమైన నీరు, దుర్వాసన, దుమ్ము తో మున్సిపల్ ప్రజలు,యువకులు, చిన్నారులు, వృద్ధులు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Leave a Reply