INDvsAFG-ODI | ఇద్దరు యువ ఆటగాళ్లకు అరంగేట్రం

INDvsAFG-ODI | ఇద్దరు యువ ఆటగాళ్లకు అరంగేట్రం

  • భారత్ తరఫున తొలి వన్డే ఆడుతున్న హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్

ఆంధ్రప్రభ: ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో (INDvsAFG-ODI) భారత జట్టు ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. యువ ఆల్‌రౌండర్ హర్ష్ దుబే, ఎడమచేతి పేసర్ గుర్నూర్ బ్రార్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశారు.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు, ధర్మశాల వేదికగా తమ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నారు. మ్యాచ్‌కు ముందు సీనియర్ ఆటగాళ్ల చేతుల మీదుగా ఇద్దరికీ డెబ్యూ క్యాప్‌లు అందజేశారు.

ఆల్‌రౌండర్‌గా హర్ష్ దుబే బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడనున్నాడు. మరోవైపు గుర్నూర్ బ్రార్ ఎడమచేతి ఫాస్ట్ బౌలర్‌గా భారత పేస్ దళానికి కొత్త బలం కానున్నాడు. వరల్డ్ కప్-2027 సన్నాహకాల్లో భాగంగా యువ ఆటగాళ్లను పరీక్షిస్తున్న టీమిండియా మేనేజ్‌మెంట్.. ఈ సిరీస్‌లో కొత్త ముఖాలకు అవకాశం ఇస్తోంది. ఈ నేపథ్యంలో హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్ ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొంది.

భారత్ జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దుబే, గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

INDvsAFG-ODI | 25 ఓవర్ల పోరుకు రంగం సిద్ధం..