పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలిసుల మెరుపుదాడి

పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలిసుల మెరుపుదాడి

  • ముగ్గురి అరెస్ట్, ఓకారు, రెండు బైక్లు సీజ్.
  • ఇందులో ఒకరు దేవాదయ శాఖ ఉద్యోగి.
  • మరో 15మంది పరారి..

చేవెళ్ల, ఆంధ్రప్రభ : ఎస్ఓటీ పోలీసులు పేకాటరాయుళ్ల పనిపట్టారు. పేకాట స్థావరమే లక్ష్యంగా మెరుపుదాడులు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం రాత్రి ఎస్ఓటీ పోలిసులు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని కందవాడ(6వ వార్డు), లొద్ది శివార్లలలో గల ఓ పౌంహౌజ్ పై దాడి చేశారు. ఇందులో పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరివద్ద గల నగదుతోపాటు, ఓకారు, రెండు బైకులను సీజ్ చేసి చేవెళ్ల పోలిస్ స్టేషన్ లో అప్పగించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని విశ్వసనీయ సమాచారం మేరకు. ఎస్ఓటీ పోలీసులు కందవాడ శివార్లలలోని మహిపాల్ పౌంహౌజ్ పై మెరుపు దాడులు నిర్వహించారు.

ఈ సమయంలో పోలీసులను చూసి పేకాట ఆడుతున్నవారు పారిపోయెందుకు ప్రయత్నించారు. కానీ వీరి ఆటలు సాగలేవు. పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలిసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట ఆడుతూ.. పట్టుబడిన వారిలో చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని పల్గుట్ట గ్రామానికి చెందిన మంగళి వెంకటేష్, కందవాడ గ్రామానికి చెందిన బండ ఎవాన్, కావలి మహిపాల్ లు ఉన్నారు. వీరు, మరికొంత మంది గత కొంతకాలంగా కందవాడ శివారు ప్రాంతంలో ప్రతినిత్యం పేకాట అడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మెరుపు దాడి చేయగా పై ముగ్గురు పట్టుబడటం జరిగింది. పేకాట ఆడెందుకు వస్తున్న మరో పదిహెను మంది విషయం తెలిసి అటునుంచే అటు పారిపోయిన్నట్లు తెలిసింది.

పేకాటరాయుళ్ల నుంచి రూ.2,044 నగదు, ఓ క్రెట కారు టీఎస్07 పీ0919, ప్యాషన్ ప్రొబైక్ టిఎస్07 జీసి6140, స్పెండర్ ప్లస్ బైక్ టీఎస్07 ఈకె3187లను అదుపులోకి తీసుకుని సీజ్ చేశారు. కాగా పేకాట ఆడుతూ.. పట్టుబడిన ముగ్గురిలో ఒకరైన కావలి మహిపాల్ దేవాదయ ఉద్యోగి. ఇతను శంషాబాద్ మండల పరిధిలోని గాన్స్ వాన్ గూడ మైసమ్మ ఆలయంలో క్యాషియర్ గా పనిచేస్తున్నారు. ఈ మేరకు వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నట్లు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు.

జూదరులపై ఉక్కుపాదం మోపుతాం: భూపాల్ శ్రీధర్, సీఐ, చేవెళ్ల పీఎస్.

పేకాట, బెట్టింగ్, ఆన్ లైన్ గెమింగ్, చిన్నపిల్లల, బాలికల అక్రమ రవాణ చట్టరిత్య నేరం. ముఖ్యంగా పేకాట, క్రికెట్ బెట్టింగ్. ఆన్ లైన్ గెమింగ్ కు యువత బానిస కావటం శోచనీయం. ఏంతో భవిష్యత్ గల యువత జీవితం పక్కదారి పడుతుంది. జూదంలో డబ్బులు పొగట్టుకుని అప్పులపాలు అవుతున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జూదరులపై ఉక్కుపాదం మోపుతాం. చట్టానికి వ్యతిరేఖంగా ప్రవర్థిస్తే ఎంతటివారైన క్షమించేదిలేదు. పేకాట, క్రికెట్ బెట్టింగ్ పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ వెల్లడించారు.