ఆధ్యాత్మిక కేంద్రాల్లో సోలార్ ఏర్పాటు ఆదర్శం..
ఆధ్యాత్మిక కేంద్రాల్లో సోలార్ ఏర్పాటు ఆదర్శం..
గుడివాడ మియాఖాన్ మసీదులో సోలార్ యూనిట్ ప్రారంభించిన ఎమ్మెల్యే రాము
ఆధ్యాత్మిక కేంద్రాలు,ప్రార్థనా మందిరాల్లో సోలార్ ఏర్పాటు చేయాలి…..
సోలార్ ఏర్పాటుపై ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహాకాలను సద్వినియోగం చేసుకోండి…
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది….
గుడివాడ – ఆంధ్రప్రభ : ఆధ్యాత్మిక కేంద్రాల్లో సోలార్ యూనిట్ల ఏర్పాటు ఆదర్శప్రాయమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పట్టణంలోని ప్రార్థనా మందిరాలు సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేసుకుని విద్యుత్ భారం తగ్గించుకోవాలని ఆయన సూచించారు.

గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని మియాఖాన్ పెద్ద మసీదు భవనంపై రూ.6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 15 కిలోవాట్ల సోలార్ యూనిట్‌ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మైనార్టీ పెద్దలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముస్లిం సంప్రదాయం ప్రకారం మైనార్టీ పెద్దలు, మత గురువులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అనంతరం మసీదులో నిర్వహించే ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, గుడివాడలో తొలిసారిగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో సోలార్ యూనిట్ ఏర్పాటు చేసిన మసీదు కమిటీని అభినందించారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా సోలార్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించడం సంతోషకరమని అన్నారు.
ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలతో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గడమే కాకుండా విద్యుత్ చార్జీల భారం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. మరిన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని, పునరుత్పాదక ఇంధన వినియోగం అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని పిలుపునిచ్చారు.
టీడీపీ ఆవిర్భావం నాటి నుంచి అన్న ఎన్టీఆర్, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నారని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. టీడీపీకి ముస్లిం సోదరులు అండగా నిలుస్తున్నారని, ఐక్యంగా ముందుకు వస్తే గుడివాడలో మైనార్టీల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
మైనార్టీ సోదరులందరూ సమిష్టిగా ఉండి అభివృద్ధి సాధించుకోవాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగితే మరిన్ని మంచి ఆలోచనలు, అవకాశాలు లభిస్తాయని అన్నారు.
సోలార్ ఎనర్జీ వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో, వారి సూచనల మేరకే మసీదులో సోలార్ యూనిట్ ఏర్పాటు చేసినట్లు మసీదు కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ వలి, ఖాజా, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు లింగం ప్రసాద్, చేకూరు జగన్మోహన్రావు, మైనార్టీ నాయకులు షేక్ ఇబ్రహీం, సయ్యద్ జబీన్, జానీ షరీఫ్, షేక్ సర్కారు, మున్వర్, మౌలాలి, కరిముల్లా, మహమ్మద్ రఫీ, మోబిన్, రషీద్, మసీదు కమిటీ సభ్యులు, టీడీపీ శ్రేణులు, స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
