కృష్ణా జిల్లాలో అకాల వర్షం.. బీభత్సం..

కృష్ణా జిల్లాలో అకాల వర్షం.. బీభత్సం..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : గత కొన్ని రోజులుగా సూర్యుడు ప్రభావంతో మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. అయితే ఈ అకాల వర్షం మరో వైపు ప్రజలకు, రైతులకు తీవ్ర ఇబ్బందులను మిగిల్చింది. మచిలీపట్నంలో రోడ్లు జలమయం అయ్యాయి. అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, గన్నవరం తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది.

మామిడి రైతుల ఆశల పై నీళ్లు చల్లింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. తీవ్ర వేసవి తాపంతో అలసిపోయిన ప్రజలు మాత్రం వర్షంతో వాతావరణం చల్లబడటంతో కొంత ఊరట పొందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

Leave a Reply