12: 00 A.M. | 19 జూన్ 2026 ముఖ్యాంశాలు

12 : 00 A.M. | 19 జూన్ 2026 ముఖ్యాంశాలు

  • సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న నాయకుడని ఎక్స్ వేదికగా కొనియాడారు.
  • అమెరికా–ఇరాన్ ఒప్పందం ఆశల మధ్య కూడా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై వైమానిక దాడులు చేయగా సుమారు 16 మంది మృతి చెందినట్లు సమాచారం.
  • చార్మినార్ ప్రాంతంలో అక్రమ ఫాస్ట్‌ఫుడ్ గోడౌన్‌పై దాడుల్లో కల్తీ, గడువు ముగిసిన ఆహార పదార్థాలు బయటపడటంతో నగరంలో ఆహార భద్రతపై ఆందోళన పెరిగింది.
  • ఐటీ షేర్ల అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు క్షీణించాయి; సెన్సెక్స్ 700 పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ 24 వేల దిగువకు చేరింది.
  • తెలంగాణలో పార్టీ విస్తరణ కోసం పవన్ కల్యాణ్ మణికొండలో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.
  • పౌరసరఫరాల శాఖలో టెండర్ల వ్యవహారం, దొడ్డు బియ్యం ఎగుమతులపై నిబంధనల ఉల్లంఘనతో వేల కోట్ల ప్రజాధనం దారి మళ్లిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  • నల్గొండ జిల్లా ముత్యాలమ్మగూడెం వద్ద రెండు కార్లు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
  • చీమకుర్తి అగ్రహారంలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ముగ్గురు కుమార్తెలను విషమిచ్చి హతమార్చి అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
  • శ్రీకాకుళం పలాస రైల్వే స్టేషన్ వద్ద తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి మృతి చెందగా ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి

click here to read more