ఉట్నూర్ లో ఘనంగా రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దాసండ్ల ప్రభాకర్, నాయకుల ఆధ్వర్యంలో గురువారం స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.సందర్భంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పులు వేసి ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్ మాట్లాడుతూ భారత దేశంలో మొట్ట మొదటిగా టెక్నాలజీ నిపరిచయంచేశారని,సమాచార సాంకేతిక పితామహుడిగా పేరు పొందారు అన్నారు.యువత రాజకీయాల్లో రాణించాలి అని, ఆయన ఆకాంక్షించారని,దేశ భవిష్యత్ కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసింది అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ నిసార్, ఆర్టీఏ మెంబర్ దూట రాజేశ్వర్, అదిలాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ఇక్బాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెస్రం భాగ్యలక్ష్మి,జగదీష్ ,ఎస్పీ రెడ్డి,మహేందర్,తిరుపతి ,తదితరులు పాల్గొన్నారు.
