ప్రయాణికులకు శుభవార్త
ప్రయాణికులకు శుభవార్త
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అధికారులు తీపి కబురు అందించారు. ఏపీలో తిరిగే టీజీఎస్ ఆర్టీసీ బస్సుల ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ బస్సులతో పోలిస్తే తెలంగాణ బస్సుల్లో ఛార్జీలు రూ. 20 నుండి రూ. 130 వరకు అధికంగా ఉండేవి. దీనివల్ల ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ఆర్టీసీ, ఇకపై ఏపీఎస్ ఆర్టీసీ ఛార్జీల మేరకే టికెట్ ధరలను వసూలు చేయాలని ఆదేశించింది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన రూట్లలో ప్రయాణించే వేలాది మందికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.
