బడి గంట మోగింది.. విద్యా ప్రస్థానం మొదలైంది..
దండేపల్లి, ఆంధ్రప్రభ : వేసవి సెలవుల విరామం ముగిసింది. పాఠశాలల ఆవరణలు మళ్ళీ సోమవారం (జూన్ 15) నుంచి విద్యార్థుల సందడితో కళకళలాడుతున్నాయి. విద్యార్థుల ఉత్సాహం, కొత్త పుస్తకాల సువాసన,కొత్త యూనిఫామ్ లు, స్నేహితుల కబుర్లతో విద్యా సంవత్సరం అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని, కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడలు, సృజనాత్మక అంశాలపై దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచిస్తున్నారు.

ఆరోగ్యంపై శ్రద్ధవహించి విద్యార్థులు సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం వంటి అలవాట్లను పెంపొందించుకోవాలని,విద్యావేత్తలు కోరుతున్నారు. సాంకేతికతతో మెరుగైన అభ్యసనం నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.అభివృద్ధి పథంలో విద్యార్థులు విద్యే ఒక ఆయుధం అని పెద్దలు చెబుతారు. ఈ కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన పట్టుదలని ప్రదర్శిస్తే, అద్భుతమైన ఫలితాలను సాధించగల్గుతాయని. పాఠశాల యాజమాన్యాలు కూడా విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
