ఘనంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు

ఘనంగా మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు

తొర్రూరు, ఆంధ్రప్రభ : ప్రజా నాయకుడు,తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ జన్మదిన వేడుకలు ఆదివారం డివిజన్ కేంద్రంలో ఆయన అభిమానులు,కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు,స్థానికులు చైర్మన్ జన్మదినం సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ముప్పారంలోని అనాధ శరణాలయంలో,తొర్రూరులోని మదర్సాలో చిన్నారులకు పండ్లు, బియ్యం వితరణ చేశారు. మున్సిపల్ చైర్మన్ శ్రావణ్ కుమార్ నికార్సైన ప్రజా నాయకుడని, ఆయన జన్మదిన సందర్భంగా అనాధ పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చిందించాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమం చేపట్టినట్లు మా ఫౌండేషన్ డైరెక్టర్ పస్తం కృష్ణ తెలిపారు.చైర్మన్ జన్మదినం సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిలు శ్రావణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రజా జీవితం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

Leave a Reply