చేంగల్ పంచాయతీ సెక్రటరీగా వినయ్ బాధ్యతలు

చేంగల్ పంచాయతీ సెక్రటరీగా వినయ్ బాధ్యతలు


భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ:
భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా నూతనంగా వినయ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిచ్‌పల్లి మండలం నుంచి బదిలీపై వచ్చిన వినయ్, చేంగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధుల్లో చేరారు.

ఇప్పటి వరకు చేంగల్ గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహించిన ప్రదీప్, వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వినయ్ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుమాల మమతా రాజు మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా పంచాయతీ సెక్రటరీగా ప్రదీప్ గ్రామ ప్రజలకు మంచి సేవలు అందించారని తెలిపారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, గ్రామ ప్రజలతో సమన్వయం చేసుకుని పనిచేశారని పేర్కొన్నారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కూడా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్ ఆకాంక్షించారు. గ్రామ పంచాయతీ పనులు సమర్థవంతంగా కొనసాగేందుకు అందరూ సహకరించాలని సూచించారు.