శాస్త్రీయ దృక్పథం సామాజిక మార్పుపై పోరాటాలుచేయాలి.

శాస్త్రీయ దృక్పథం సామాజిక మార్పుపై పోరాటాలుచేయాలి.

సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రామక్క.

ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థి ఉద్యమాల చరిత్ర భారత విద్యా వ్యవస్థ విద్యార్థుల సమస్యలు శాస్త్రీయ దృక్పథం ప్రజాస్వామ్యకులు సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకమని సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రామక్క పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ లో పిడి ఎస్ యు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు నాలుగో రోజు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమం పిడి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు మునగాల శివ అధ్యక్షతన వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన రామక్క మాట్లాడుతూ సమాజంలోని సమస్యలను అర్థం చేసుకొని వాటిని ప్రజలకు చేరవేసి పరిష్కరించాలన్నారు. విద్యార్థులు అధ్యయనంతో పాటు రచనలు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.

విద్యార్థులపాత్ర నైపుణ్యాలు విప్లవోద్యమ చరిత్ర పై అవగాహన పెంచుకోవాలన్నారు. శిక్షణల ద్వారా విద్యార్థులు విద్యార్థి సంఘం నాయకులు సమాజం పట్ల బాధ్యతతో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వల యొక్క విద్యా వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించుకుని ముందుకు సాగాలన్నారు.ఫీజుల నియంత్రణ చట్టం, నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకై,పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని,ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలను మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు కంపాటి పృథ్వీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్,రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహ రావు,దీక్షిత, రాష్ట్ర సహాయ కార్యదర్శి గణేష్,సురేష్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply