సత్తియాడి జాతరలో భక్తి సందడి

సత్తియాడి జాతరలో భక్తి సందడి
– ఘనంగా భోగ్ బండారో, గ్రామ ఐక్యతకు నాంది
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : నల్లబెల్లి మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన సత్తియాడి జాతర మహోత్సవం భక్తి పారవశ్యంతో,ఉత్సాహభరితంగా ఘనంగా జరిగింది. గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయి, భక్తుల సందడితో కళకళలాడింది. ఈ సందర్భంగా బజ్జు తండా సర్పంచ్ జాటోత్ రవి చిన్నా ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో సమూహంగా పాల్గొని సత్తియాడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నైవేద్యాలు సమర్పిస్తూ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఈ వేడుకలకు మాజీ ఎంపీ అజ్మీరా సీతారామ్ నాయక్, డాక్టర్ ఉదయ్ సింగ్, ఎలక్ట్రికల్ డీఈ జాటోత్ హార్జీ నాయక్, ఎంపీటీసీ అజ్మీరా లక్ష్మి సామ్యతో పాటు గ్రామ పెద్దలు, యువత, మహిళలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
